English | Telugu

ఇండస్ట్రీలో పెరుగుతున్న విలన్ లు..!

హీరోగా చేసి కెరీర్ కాస్త స్లంప్ లో ఉంటే, విలన్ గా ట్రై చేయడం, లేదా హీరోగా అవకాశాలున్న సమయంలోనే పక్క భాషల్లో విలన్ గా చేయడం ఈ మధ్య హీరోలకు బాగా కలిసి వస్తోంది. స్టైలిష్ విలన్స్ గా, హీరోకు ఏమాత్రం తగ్గని స్టైల్స్ అండ్ క్యారెక్టర్ వెయిట్ తోనే నెగటివ్ షేడ్స్ అద్భుతంగా పోషిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపోయే హీరోలకు కెరీర్ మళ్లీ ప్రారంభమవుతుంటే, విలన్ గా సొంతభాషలో ప్రేక్షకులు ఒప్పుకోని హీరోలు పక్కభాషల్లో నెగటివ్ రోల్స్ లో రెచ్చిపోతున్నారు. హీరోలుగా డిజాస్టర్ల బాట పట్టి మళ్లీ విలన్ గా లైఫ్ సంపాదించిన వాళ్లలో, తారకరత్న, జగపతిబాబు లాంటి వాళ్లుంటే, ఒక భాషలో హీరోగా చేస్తూనే మరో భాషలో విలన్ గా చేస్తున్నారు ఆది పినిశెట్టి, అరుణ్ విజయ్, ఉపేంద్ర, నీల్ నితిన్ ముఖేష్ లాంటి వాళ్లు. ఒకసారి వీళ్ల సంగతేంటో చూసొచ్చేద్దాం రండి..

1. జగపతిబాబు

ఫ్యామిలీ హీరోగా, మరో శోభన్ బాబు గా హీరో కెరీర్లో ఒక వెలుగు వెలిగాడు జగపతిబాబు. కానీ కాలం మారింది. ఈ ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు తీయలేకపోవడమో, లేక ఇక తనకు వయసైపోయిందని భావించడమో కారణం కావచ్చు..కానీ లెజండ్ తో విలన్ గా ప్రభంజనం సృష్టించాడు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత ఆయన విలన్ కెరీర్ కు తిరుగేలేకుండా మారిపోయింది. వరసపెట్టి పెద్ద, చిన్న స్టార్స్ అందరి సినిమాల్లోనూ విలన్ గా కుమ్మేసుకుంటున్నాడీ ఫ్యామిలీ స్టార్.

2. తారకరత్న

ఒకటో నెంబర్ కుర్రాడు తర్వాత, ఈ నందమూరి కుర్రాడు కూడా ఒకటో నెంబర్ కు వెళ్తానని భావించాడు. కానీ పరిస్థితుల ప్రభావం. కాలం మారిపోయింది. అయినా గానీ తన పోరాటం ఆపని తారకరత్న, అమరావతితో విలన్ గా హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా రాజా చెయ్యి వేస్తే సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇకనుంచి చాలా తెలుగు సినిమాల్లో తారకరత్న విలన్ గా కనిపించే అవకాశం ఉంది.

3. ఆది పినిశెట్టి

రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది పుట్టుకతో తెలుగువాడైనా, తమిళ ప్రేక్షకులకే సుపరిచితుడు. అక్కడ హీరోగా మంచి హిట్సే ఉన్న ఆది తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా, సరైనోడులో విలన్ గానే మంచి గుర్తింపు వచ్చింది. చాలా స్టైలిష్ గా, హీరో అల్లు అర్జున్ కు పోటాపోటీగా చేసిన ఆది పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

4. ఉపేంద్ర

కన్నడలో సూపర్ స్టార్ అయిన ఉపేంద్రకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా ఉపేంద్ర, ఏ లాంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న ఉపేంద్ర, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో విలన్ గా ట్రై చేశాడు. ఆఫ్ కోర్స్ క్లైమాక్స్ లో మంచిగా మారిపోతాడు. కానీ హీరోకంటే వెయిట్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది.

5. అరుణ్ విజయ్

తమిళ సినిమాల్లో హీరోగా చేసే అరుణ్ విజయ్, అజిత్ హీరోగా వచ్చిన ఎంతవాడుగానీ సినిమాతో విలన్ గా మార్కులు కొట్టేశాడు. ఆ సినిమాలో అతను చేసిన విక్టర్ పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. తర్వాత తెలుగులో బ్రూస్లీ సినిమాలో కూడా విలన్ గా చేశాడు అరుణ్ విజయ్.

ఒకవేళ తన సరైనోడు సినిమాను వేరే భాషలో రీమేక్ చేస్తే, మూవీలోని విలన్ పాత్ర చేయడానికి తాను రెడీ అని అల్లు అర్జున్ కూడా చెప్పేశాడు. హీరో శ్రీకాంత్ కూడా రేపో మాపో విలన్ గా మారితే ఆశ్చర్యం లేదు. ' 24 ' సినిమాలో హీరో సూర్య యే విలన్ గా చేశాడు. ఇప్పటి హీరోలు విలన్ గా చేయడానికి ఒప్పుకోవడం వెనుక కారణం, వాళ్లకు కూడా హీరో తో సమానమైన రోల్ తో పాటు గతంలోలా బుగ్గమీద గాటు, ఏవో విచిత్రమైన కాస్ట్యూమ్స్ కాకుండా కూడా స్టైలిష్ గా చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు కూడా సై అంటున్నారు హీరోలు. ఒకప్పుడు విలన్ గా వచ్చి హీరో అయితే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం హీరోలే విలన్లుగా కూడా ట్రై చేయడం ట్రెండ్ గురూ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.