ప్రముఖ అగ్ర నటుడి మృతి.. షాక్ లో అగ్ర హీరోలు
రచయితగా, దర్శకుడుగా, నటుడుగా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తనదైన శైలిలో రాణించారు శ్రీనివాసన్. మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన శ్రీనివాసన్(Sreenivasan)ఆయా రంగాల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించి మలయాళ చిత్ర సీమలో చాలా ప్రభావంతమైన సినీ పర్సనాలిటీ గా కీర్తింపబడ్డాడు. అగ్ర నటులైన మోహన్ లాల్, మమ్ముట్టి నుంచి వచ్చిన చాలా చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకుని ఆ ఇద్దరికి ధీటైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి మెస్మరైజ్ చేసాడు.