English | Telugu

బ్రేకప్‌.. విజయ్‌వర్మ, తమన్నా లవ్‌ జర్నీ ముగిసిందా?

సినిమా ఇండస్ట్రీలో లవ్‌, బ్రేకప్‌.. పెళ్లి, విడాకులు.. ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పుడు ఎవరితో రిలేషన్‌లో ఉంటారో, ఎప్పుడు బ్రేకప్‌ చెప్పుకుంటారో వారికే తెలీదు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ కల్చర్‌ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో హీరోకి, హీరోయిన్‌కి లెక్కకు మించిన లవ్‌ స్టోరీలు ఉంటాయి. అవన్నీ తమ జీవితంలో కామన్‌ అన్నట్టుగా బిహేవ్‌ చేస్తుంటారు. తాజాగా విజయ్‌వర్మ, తమన్నా జంటపై రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి. రెండేళ్ళుగా రిలేషన్‌లో ఉన్న ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం, వివిధ వేడుకల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారిద్దరూ. కానీ, ఇటీవల వీరి బంధానికి బీటలు వారాయా? అనే అనుమానం అందరికీ కలుగుతోంది.

సినిమా రంగంలోని ఇలాంటి రిలేషన్‌షిప్‌ల విషయంలో చిన్న తేడా వచ్చిన ఆ లవర్స్‌ కంటే ముందు నెటిజన్లు పసిగట్టేస్తారు. విజయ్‌వర్మ, తమన్నాల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లే విజయ్‌, తమన్నా ఈమధ్యకాలంలో చాలా ఈవెంట్స్‌కి విడివిడిగానే హాజరయ్యారు. దీంతో వీరి లవ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడ్డట్టేనని చెప్పుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై విజయ్‌వర్మ స్పందిస్తూ ‘రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలి. ఒక ఐస్‌క్రీమ్‌ చివరి వరకు ఎలా ఆస్వాదిస్తామో అలా జీవితంలో వచ్చే ప్రతి అంశాన్నీ పాజిటివ్‌గానే తీసుకోవాలి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది’ అంటూ ఓ సూక్తి చెప్పాడు. ఇక తమన్నా కూడా బ్రేకప్‌పై స్పందించింది. ‘రిలేషన్‌ షిప్‌లో లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను. ప్రేమను వ్యాపారంలా చూడకూడదు. అలా చేస్తే తప్పకుండా సమస్యలు వస్తాయి. అందుకే భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్‌ చేసింది. ఈ రెండు ట్వీట్స్‌ను గమనిస్తే.. ఇద్దరూ తమ లవ్‌కి గుడ్‌బై చెప్పుకున్నారన్న విషయం అర్థమవుతుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.