English | Telugu
హీరోయిన్ కసికసిగా ఉందంటు దొరికిపోయిన మల్లారెడ్డి
Updated : Mar 29, 2025
గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం(Sp Balasubramanyam)తనయుడు ఎస్ పి చరణ్(Sp charan)ప్రధాన పాత్రలో,శ్రీహర్ష అన్నపురెడ్డి(sri harsha annapareddy)కషికా కపూర్(Kashika Kapoor)జంటగా నటిస్తున్న చిత్రం'లవ్ యువర్ ఫాదర్'.చతప్రతి శేఖర్, నవాబ్ షా,రఘుబాబు,షకలక శంకర్,ప్రవీణ్ బెల్లంకొండ ఇతర పాత్రల్లో కనిపిస్తుండగా పవన్ కేత రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో ఎస్ వి కృష్ణా రెడ్డి తో కలిసి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన కిషోర్ రాఠీ, అన్నపురెడ్డి సామ్రాజ్యంతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా ఏప్రిల్ 5 న మూవీ రిలీజ్ కానుంది.
రీసెంట్ గా 'లవ్ యువర్ ఫాదర్'(Lyu)ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మేడ్చల్ ఏంఎల్ఏ మాజీ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Chamakura mallareddy)హాజరవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ప్రసంగించిన మల్లారెడ్డి చిత్ర బృందానికి విషెస్ చెప్పాడు.హీరోయిన్ కషికా కపూర్ ని ఉద్దేశించి మాట్లాడుతు హీరోయిన్ పేరు కసికపూర్ అంట,కసికసిగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.దీంతో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆడపిల్ల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే విమర్శలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి.