English | Telugu
జోరు మీదున్న తమన్నా
Updated : Jun 5, 2015
సక్సెస్‌లతో జోరుగా ఉండడం నథింగ్ స్పెషల్. కానీ ఫెయిల్యూర్స్‌తోనూ అదే జోరుని మెయిన్ టెయిన్ చేయడం సమ్‌థింగ్ స్పెషల్. తేనెకళ్ల బ్యూటీ తమన్నాని రెండో కేటగిరికి చెందిన హీరోయిన్‌గా మెన్షన్ చేయొచ్చు. గతకొంతకాలంగా అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ సిరీస్ ఫ్లాప్స్‌తో సతమతమైన తమన్నా.. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని జారవిడుచుకోకుండా తన టాలెంట్‌ని అస్త్రంగా ప్రయోగిస్తోంది. ఫలితంగానే రానున్న మూడు నెలల్లో నెలకో సినిమాతో పలకరించేందుకు ఈ మిల్కీ బ్యూటీ రెడీ అయింది. జులై 10న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'తోనూ.. ఆగస్టు 14న తమిళ చిత్రం 'వాసువుమ్ శరవణనుమ్ ఒన్న పడిచ్చవాంగ' (ఇందులో ఆర్య హీరో)తోనూ.. సెప్టెంబర్ 19న రవితేజ 'బెంగాల్ టైగర్' తోనూ సందడి చేయబోతోంది తమన్నా. ఈ వైనంతో 'ఫ్లాప్‌లు వచ్చినా జోరుని కొనసాగించడం ఎలా.. అనేదానికి తమన్నానుంచి సలహాలు అడిగితే పోలా..' అనుకుంటున్నారట తోటి కథానాయికలు.