English | Telugu
బర్త్ డే స్పెషల్‌గా ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం
Updated : Jun 5, 2015
లవర్ బోయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్.. గతేడాది ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. చనిపోవడానికి ముందు ఆయన నటించిన ఓ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'చిత్రం చెప్పిన కథ' పేరుతో తెరకెక్కిన ఈ మూవీని జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశేషమేమిటంటే.. అదే రోజు ఉదయ్ కిరణ్ బర్త్‌డే కావడం. మరి.. బర్త్ డే గిఫ్ట్‌గా వస్తున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం అభిమానులను అలరిస్తుందో లేదో చూడాలి. మోహన్ ఆల్ర్‌క్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అమరనేని నరేష్ అందించగా మున్నా కాశి సంగీతమందించారు. ప్రస్తావించిదగ్గ మరో విషయమేమిటంటే.. ఉదయ్ మొదటి సినిమా 'చిత్రం' జూన్ నెలలో విడుదలైతే చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ' కూడా అదే నెలలో రిలీజ్ కానుండడం.