English | Telugu
10 కోట్లు దానం చేసిన సూర్య
Updated : May 8, 2025
సుదీర్ఘ కాలం నుంచి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో పాన్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తున్న హీరో 'సూర్య'(Suriya). సినిమాల్లోని క్యారెక్టర్స్ ద్వారానే కాకుండా నిజ జీవితంలోను పేద ప్రజలకి అండగా ఉంటు, తన పెద్ద మనసుని చాటుకుంటున్నాడు. ఇందుకు నిదర్శనమే 'అగరం ఫౌండేషన్'. 2006 సెప్టెంబర్ 25 న 'అగరం ఫౌండేషన్'(Agaram Foundation)ని సూర్య స్థాపించాడు. తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది పేద విద్యార్థులని చదివిస్తు వసతి, భోజన సదుపాయాలని కల్పిస్తున్నాడు. తాను ఉంటున్న ఒక ఇంటిని కూడా అగరం ఫౌండేషన్ కి కేటాయించడం జరిగింది.
రీసెంట్ గా సూర్య అగరం ఫౌండేషన్ ని సందర్శించాడు. అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన సూర్య అనంతరం ఫౌండేషన్ కి పది కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో స్వచ్చంద సంస్థ పేరుతో కొంత మంది విరాళాలు సేకరిస్తారు. కానీ తన డబ్బునే ఫౌండేషన్ కి ఇవ్వడంపై నెటిజన్స్ సూర్య ని అభినందిస్తు ట్వీట్స్ చేస్తున్నారు. అభిమానులైతే సూర్య ఫ్యాన్స్ గా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామంటున్నారు. అగరం సంస్థలో ప్రస్తుతం రెండువేలకి మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకి చెందిన చాలా మంది ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు.
సినిమాల విషయానికి వస్తే సూర్య మే 1 న 'రెట్రో'(retro)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులని నిరాశపరిచింది. తమిళంలో మాత్రం హిట్ టాక్ తో ఇప్పటికే 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటి, మరిన్ని కలెక్షన్స్ సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. సూర్య తన తదుపరి చిత్రాన్ని మూకుత్తి అమ్మన్ ఫేమ్ ఆర్ జె బాలాజీ దర్సకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సార్, లక్కీభాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి(Venki Atluri)తో కూడా సూర్య ఒక భారీ మూవీ చేస్తున్నాడు.
