English | Telugu

మాస్ తడాఖా: ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.90 కోట్లు

తమిళ నటుడు సూర్య, సమంత నటించిన 'అంజాన్' సినిమా రోజురోజుకీ కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది. తెలుగులో 'సికిందర్' పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్ మార్కెట్‌లో మంచి బిజినెస్‌ని రాబట్టింది. మాస్ లుక్‌తో పాటు.. పాటలు సూపర్ హిట్ అయితే బిజినెస్ ఏవిధంగా జరుగుతుందో చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా జరిగింది.

అంజాన్:
తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ - రూ. 38 కోట్లు
ఓవర్ సీస్ - రూ. 10 కోట్లు
కర్ణాటక, కేరళ & మిగతా చోట్ల - రూ. 7 కోట్లు
శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ - రూ. 17 కోట్లు


సికిందర్ :
ఆంధ్రప్రదేశ్ & నైజాం రైట్స్ - రూ. 15 కోట్లు
శాటైలైట్ - రూ. 3 కోట్లు


తమిళంలో భారీ క్రేజ్ వున్న లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళంలో దాదాపు 1,500 థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా చెన్నైలోనే ఏకంగా 37 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తెలుగులో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న లగడపాటి శ్రీధర్ ఇప్పటికే లాభాలు పొందినట్లు సమాచారం. మాస్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదిరిస్తారనేది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌‌ను చూస్తే తెలుస్తోంది.