English | Telugu

సూర్య తో త్రివిక్రమ్ సినిమా ఉందా..?

తమిళ నటుడు సూర్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగు సినిమా చేయడానికి మాత్రం సూర్యకు కుదరట్లేదు. అతని తమ్ముడు కార్తీ మాత్రం ఊపిరితో డైరెక్ట్ తెలుగు సినిమా తీసి హిట్ కొట్టేశాడు. సూర్యను డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగిన ప్రతీసారీ నాకు కుదరట్లేదనో, లేక రేపో మాపో చేస్తాననో చెప్పేవాడు. కానీ 24 సినిమా ప్రమోషన్ కోసం సిటీలోకి వచ్చిన సూర్య ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఆన్సర్ చేశాడు. ఇప్పటికే తను రాజమౌళితో సినిమా చేయాల్సి ఉందని, కానీ మిస్ చేసుకున్నాని, చాలా రోజులుగా త్రివిక్రమ్ తో సినిమా గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయని, త్వరలోనే దానికి సంబంధించి క్లారిటీ ఇస్తానన్నాడు సూర్య. తాను త్రివిక్రమ్ మూడు కథలపై చర్చించామని, వాటిలో ఒకటి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందన్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందట. భవిష్యత్తులో రాజమౌళితో కూడా కంపల్సరీ సినిమా చేస్తానని స్పష్టం చేశాడు సూర్య. ఇక 24 విషయానికొస్తే, ఆ సినిమా తన సినీ కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని, నిర్మాతగా మంచి లాభాలు కూడా తెచ్చిపెడుతుందంటున్నాడు సూర్య. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన 24 మే 6 రిలీజ్ కానుంది. టైం మెషీన్ లాంటి ఒక వాచ్ గురించి జరిగే కథే 24 మూవీ అని సమాచారం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.