English | Telugu

క‌ల్యాణ్‌రామే కార‌ణం అంటున్నాడు..

సీక్వెల్ సినిమాలు సూప‌ర్ హిట్ అయిన చ‌రిత్ర టాలీవుడ్‌లో చాలా తక్కువ. అందుకే సీక్వెల్ సినిమా అంటే జ‌నాలు భ‌య‌ప‌డ‌తారు. అయితే కిక్ కి మాత్రం సీక్వెల్ తీశాడు సురేంద‌రెడ్డి. ఈ సినిమా రిజ‌ల్ట్‌తో దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందేమో.. `అస‌లు ఈ సినిమా నేను తీయాల్సింది కాదు..` అంటున్నాడిప్పుడు.

కిక్ 2 సినిమా తీసే ఉద్దేశ్య‌మే త‌న‌కు లేద‌ని, క‌ల్యాణ్‌రామ్ బ‌ల‌వంతంమీదే ఈ సినిమా చేయాల్సివ‌చ్చిందంటున్నాడు సురేంద‌ర్‌రెడ్డి. ఈ సినిమా బ‌డ్జెట్ పెరిగిపోయింద‌నే విష‌యంలోనూ ఏమాత్రం వాస్త‌వం లేదంటున్నాడు. ఇంత అవుతుంద‌ని ముందే క‌ల్యాణ్‌రామ్‌కి చెప్పేశాడ‌ట‌. క‌ల్యాణ్‌రామ్‌కీ త‌న‌కీ మ‌ధ్య విబేధాలొచ్చిన మాట కూడా ఉత్తినే అని చెప్తున్నాడు. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు తాను స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని కాస్త ఘాటుగా స్పందించాడీ ద‌ర్శ‌కుడు.

ఎవ‌రెవ‌రో ఏదేదో రాస్తుంటారు.. వాటికి నేను స‌మాధానం ఇవ్వాలా అంటూ రివ‌ర్స్ అయ్యాడు. అయితే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో మాత్రం బ‌డ్జెట్ పెరగ‌డంతోనే క‌ల్యాణ్‌రామ్‌కీ, సురేంద‌ర్‌రెడ్డి కీ మ‌ధ్య చెడింద‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌లు కూడా లేవ‌ని చెప్పుకొంటున్నారు. దానికి త‌గ్గ‌ట్టు కిక్ 2 వైఫ‌ల్యం కూడా సురేంద‌ర్‌రెడ్డి ఇప్పుడు క‌ల్యాణ్‌రామ్ పైనే తోసేస్తున్నాడు. ఏంటో... ఈసినిమా జ‌నాలు. సినిమా హిట్ట‌యితే ఓ మాట‌, పోతే ఇంకో మాట‌.