English | Telugu
హత్య కేసులో ప్రముఖ హీరోకి బెయిల్ రద్దు
Updated : Aug 14, 2025
తన అభిమాని 'రేణుకస్వామి'(Renuka Swami)ని హత్య చేసిన సంఘటనలో, ప్రముఖ కన్నడ నటుడు 'దర్శన్'(Darshan)గత ఏడాది జూన్ 11 న అరెస్టయ్యి, దాదాపు ఏడు నెలల పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత వైద్యపరమైన కారణాలు చూపించి హైకోర్ట్ లో బెయిల్ కి అప్పీల్ చేసాడు. డిసెంబర్ 13 న కర్ణాటక హైకోర్టు(Karnataka High court)బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.
దీంతో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తు కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పుని వెల్లడించింది. సదరు తీర్పులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులలో తీవ్రమైన లోపా బియష్టత ఉంది. హైకోర్టు విచారణ దశకు ముందు జరిగిన వాటినే విచారించింది. దర్శన్ ని విడుదల చెయ్యడానికి సరైన కారణం లేదు. ఏక పక్షంగా తీర్పుని వెల్లడించింది. విచారణకి కోర్టు మాత్రమే సరైన వేదిక, బలమైన ఆరోపణలు, ఫోరెన్సిక్ ఆధారాలు బెయిల్ రద్దుకి బలాన్ని ఇస్తున్నాయి. ఇంత తీవ్రమైన కేసులోపూర్తి విచారణ చెయ్యకుండా బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్ట్ బెయిల్ రద్దు చేసింది.