English | Telugu

సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా తెనాలిలో ‘సూపర్ మస్తీ’

దివంగత సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు దినోత్సవం ఈ నెలాఖరున రాబోతున్న సందర్భంగా ఈటీవీ ఒక స్పెషల్ ఈవెంట్ చేసింది. కృష్ణ గారు పుట్టిన తెనాలిలో ఆయనకు నివాళి అర్పిస్తూ "సూపర్ మస్తీ" పేరుతో ఒక షో నిర్వహించింది. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించింది సుమ. "తెనాలి..నాకన్నా మీ వాయిస్ ఎక్కువగా వినబడాలి" అని గట్టిగా అరిచి చెప్పింది. ఇక ఈ ఈవెంట్ లో పాటలు, ఆటలు, కామెడీ స్కిట్లు ఉంటాయి అని చెప్పింది సుమ. తర్వాత ఒక కూల్ డ్రింక్ బాటిల్ ని తీసుకొచ్చి దేవదాస్ లా తాగుతూ "నాకు యాంకరింగ్ అంటే వ్యసనం అనుకుంటున్నారా..అలవాటు పడ్డ సాంప్రదాయం.. మ్యుజీషియన్స్, స్టేజి మొత్తం ధూమ్ ధామ్ చేయాలి. "తెనాలి సగర్వంగా చెప్పుకునే పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు..తెలుగు సినిమా ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారు బతికి ఉన్నట్టే" అని చెప్పింది సుమ. అలా సింగర్స్ టీమ్ అంతా కలిసి కృష్ణ గారి హిట్ సాంగ్స్ పాడి వినిపించారు.

"పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు" అని సుమ అనేసరికి సాకేత్ కొమాండూరి "భీమ్లా నాయక్" సాంగ్ పాడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. తర్వాత బాలకృష్ణ పాడిన పాటలు కూడా పాడి వినిపించారు. తర్వాత "ఆశా పాశం" సాంగ్ ని సాకేత్ పాడుతూ ఉండగా ఫ్లూట్ తో నాగరాజు మ్యూజిక్ అందించారు. అలా ఇద్దరూ కలిసి ఈ సాంగ్ కి కొంచెం సంగీతాన్ని కలిపి కొత్త ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇక ఈ షో 21 వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ షోలో ఎలాంటి ఈవెంట్స్ , సాంగ్స్ ఉంటాయో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.