English | Telugu

సన్నీ లియోన్ ఇక ఆ సినిమాలు చేయనంటోంది..!

సన్నీ లియోన్ కు మన దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. పోర్న్ స్టార్ గా కెరీర్ సాగించిన ఈ భామ కన్ను, ఎందుకో ఉన్నట్టుండి బాలీవుడ్ పై పడింది. ఇక్కడ సినిమాల్లో హీరోయిన్ గా మారాక పాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, హాయిగా ఐటెం సాంగ్స్, రొమాంటిక్ మూవీస్ చేసుకుంటోంది. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, కుర్రకారు గుండెల్లో బాంబు పేల్చింది సన్నీ. ఇప్పటి వరకూ ఎక్స్ పోజింగ్ సినిమాలు, ఐటెం సాంగ్స్ చేసి చేసి విసుగొచ్చేసిందని, ఇక నుంచీ అవి చేయనని తేల్చి చెప్పేసింది. తనకు పేరు తెచ్చిన ఆ రొమాంటిక్ జానర్ ను ఇకనుంచీ వదిలేస్తున్నానని ప్రకటించేసింది. త్వరలో విడుదల కాబోతున్న వన్ నైట్ స్టాండ్ సినిమానే తనకు ఈ జానర్ లో చివరిదని, ఇకపై ఈ సినిమాల్ని ఒప్పుకోనని ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. స్క్రిప్ట్ బాగా డిమాండ్ చేస్తే తప్ప, ముద్దు సీన్లకు కూడా ఒప్పుకునే ఛాన్స్ లేదట. ఇప్పటికే షారుఖ్ రయీస్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ, త్వరలోనే సల్మాన్, అమీర్ సినిమాల్లో కూడా చిందేయాలని, మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో హీరోయిన్ గా దూసుకుపోవాలని కలలు కంటోంది. సన్నీ ఇచ్చిన ఈ షాక్ కు కుర్రకారు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.