English | Telugu

ఈరోజు రెహమాన్, చైతూ సెకండ్ సాంగ్ రిలీజ్...!

అక్కినేని యువహీరో నాగచైతన్య రెండు సినిమాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఒకటి గౌతమ్ మీనన్ తో సాహసం శ్వాసగా సాగిపో సినిమా కాగా, మరొకటి చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ప్రేమమ్. సాహసం శ్వాసగా సినిమాకు రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి చివరి వారంలో వెళ్లిపోమాకే అన్న పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో దాదాపు 40 లక్షల వ్యూస్ సాధించడం విశేషం. గురువారం సాయంత్రం షోకిల్లా అనే మరో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మూవీ టీం. మే నెలాఖరున ఆడియో రిలీజ్ జరుపుకోనున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన మళయాళ భామ మంజిమా మోహన్ నటిస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ మొదటిసారి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించడం విశేషం. సినిమా జూన్ రెండో వారంలో రిలీజవుతుందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.