English | Telugu

సందీప్ కిషన్ నాయనమ్మ మృతి..సెయింట్ పీటర్స్ కెథడ్రల్ చర్చి సెమెట్రీ లో  భూస్థాపన

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో సినీ కెరీర్ ని ప్రారంభించిన 'సందీప్ కిషన్'(Sundeep Kishan)అనతి కాలంలోనే అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు. తమిళ సినీ రంగంలో కూడా అడుగుపెట్టి కీలకమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు ముందుకు దూసుపోతున్నాడు. ఈ ఏడాది 'మజాకా' తో అలరించిన సందీప్ కిషన్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

రీసెంట్ గా సందీప్ కిషన్ నాయనమ్మ శ్రీపాదం ఆగ్నేశమ్మ విశాఖపట్నంలో చనిపోయారు. 88 సంవత్సరాల వయసు కలిగిన ఆగ్నేశమ్మ ,విశాఖపట్నంతో పాటు పరిసరాల ప్రాంతాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసేటప్పుడు ఎంతో మంది పేద విద్యార్థులని చదివించి వాళ్ళకి అన్ని విషయాల్లోను అండగా నిలిచింది. నిన్న విశాఖపట్నంలోని సెయింట్ పీటర్స్ కెథడ్రల్ చర్చి సెమెట్రీ లో ఆమె భూస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ మేనమామ అగ్ర సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు(Chota k Naidu)పాల్గొన్నాడు. వయసు పైబడిన రిత్యా ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది.

ఆగ్నేశమ్మ మరణ వార్తని సందీప్ కిషన్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా తెలియచేసాడు. ఆగ్నేశమ్మ పెద్ద కుమారుడు రవి కొడుకే సందీప్ కిషన్.