English | Telugu

అపోలో క్యాన్సర్ ఎవేర్ నెస్ సభలో సుమంత్,గల్లా అరుణ

అపోలో హాస్పిటల్ వారు తమ వార్షికోత్సవం సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ల కోసం, ఇంకా ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్ నెస్ కలిగించటానికి నిర్వహిస్తున్న క్యాన్సర్ అవేర్ నెస్ సభను ఏర్పాటుచేశారు.ఈ క్యాన్సర్ అవేర్ నెస్ సభకు ప్రముఖ సినీ యువ హీరో సుమంత్, రాష్ట్ర భూగర్భ మరియూ గనుల మంత్రి గల్లా అరుణ కుమారి హాజరయ్యారు.అపోలో హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లను అరుణ కుమారి , హీరో సుమంత్ ఆప్యాయంగా పలకరిస్తూ, ఆ క్యాన్సర్ పేషెంట్ల కష్ట సుఖాలను తెలుసుకుని వారికి మానసిక ధైర్యాన్ని కలిగించారు.ఇంకా ఆ క్యాన్సర్ పేషెంట్లలో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించేందుకు సుమంత్, అరుణ కుమారి కూడా వారితో మాట్లాడారు.

అనంతరం అపోలో క్యాన్సర్ పేషెంట్ల సాంసృతిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆ పోటీల్లో పాల్గొని గెలిచి వారికి సుమంత్, గల్లా అరుణ కుమారి బహుమతులు అందించారు.వారితో సుమంత్, మంత్రి అరుణ కుమారి వీలైనంత సమయాన్ని గడిపి ఆ క్యాన్సర్ పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ఆనందపరిచారు. ఆ క్యాన్సర్ పేషెంట్లలో చిన్న పిల్లలు కూడా ఉండటం విశేషం. ఈ అపోలో క్యాన్సర్ ఎవేర్ నెస్ సభలో పాల్గొనటం తమ జీవితంలో ఒక మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని హీరో సుమంత్, గల్లా అరుణ కుమారి మీడియాకు తెలియజేశారు