English | Telugu

నేషనల్ అవార్డు చరణ్ కి రావాల్సింది..సుకుమార్ ఆసక్తి కర వ్యాఖ్యలు 

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer).ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ లో ఒకరైన శంకర్(shankar) దర్శకుడు.దీంతో గేమ్ చేంజర్ పై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకులోను భారీ అంచనాలే ఉన్నాయి.సంక్రాంతి కానుకగా వచ్చే నెల జనవరి 10న రిలీజ్ కాబోతుంది.ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా యుఎస్ లోని డల్లాస్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది.ఎంటైర్ ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అవుట్ అఫ్ కంట్రీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్న ఫస్ట్ మూవీగా గేమ్ చేంజర్ సరికొత్త రికార్డుని కూడా నెలకొల్పింది.

ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖ అగ్ర దర్శకుడు సుకుమార్(sukumar)ముఖ్య అతిధిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ ని చూసాను.కాబట్టి మొట్ట మొదటి రివ్యూని నేనే ఇస్తున్నాను.ఫస్ట్ ఆఫ్ ఆసమ్,ఇంటర్వెల్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్,సెకండ్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి.క్లైమాక్స్ లో చరణ్ ఎమోషన్ ఒక రేంజ్ లో ఉంటుంది.ఖచ్చితంగా చరణ్ కి ఈ సారి నేషనల్ అవార్డు వస్తుంది.రంగస్థలం సినిమా అప్పుడే చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను.కానీ ఈ సారి మాత్రం నేషనల్ అవార్డు పక్కా. ఆ రేంజ్ లో చరణ్ పెర్ఫార్మెన్సు ఉంది.శంకర్ గారి జెంటిల్ మెన్,భారతీయుడు సినిమాలు చూసి ఎంత ఎంజాయ్ చేసానో గేమ్ చేంజర్ ని కూడా అంతే ఎంజాయ్ చేశాను.

ఇక నేను ఒక హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోని చాలా ప్రేమిస్తాను.ఆ సమయంలో హీరోకి, నాకు మధ్య మంచి అనుబంధం కూడా ఉంటుంది.కానీ ఒన్స్ సినిమా అయిపోయాక నేను ఎవరితో కనెక్ట్ అవ్వను.కానీ రంగస్థలం అయిపోయాక కూడా నేను అనుబంధాన్ని కొనసాగించిన ఒకే ఒక్క హీరో చరణ్.ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాలనుకున్నాను.కానీ సందర్భం రాలేదు. చరణ్ నా బ్రదర్ అంతకు మించి కూడా.ఇద్దరం ఎప్పుడు కలుస్తుంటాం. చాలా విషయాల మీద డిస్కర్షన్ చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.