English | Telugu
లీడర్ మల్లిగా సుహాస్.. రేంజ్ మరింత పెరిగేనా!
Updated : Aug 19, 2023
'కలర్ ఫొటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రతిభ గల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఈ క్రమంలోనే.. సుహాస్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా వస్తోంది. అదే.. 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు'. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు.
శనివారం (ఆగస్టు 19) సుహాస్ పుట్టినరోజు. ఈసందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో సుహాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు' సినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుహాస్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్న 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు'కి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నాడు.వాజిద్ బేగ్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. మరి.. 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు'తో సుహాస్ రేంజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి.