English | Telugu

సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’ సెకండ్‌ పోస్టర్‌ విడుదల!

వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్‌ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. అనౌన్స్‌మెంట్‌ నుంచి పాన్‌ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్‌ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్‌ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్‌ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్‌ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.

ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌ బాబు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్‌ సినిమాల్లో ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్‌ నేచురల్‌ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్‌ బాబు కనిపిస్తున్నారు. అభిమానులు పోస్టర్‌ను చూసి సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై చూద్దామా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నవ దళపతి సుధీర్‌ బాబు మాట్లాడుతూ ‘‘‘జటాధర’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమాలోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను రేపు ఆడియెన్స్‌ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు’’ అన్నారు.

భారీ బడ్జెట్‌తో అంచనాలను మించేలా ఓ అద్భుతమైన సరికొత్త చిత్రాన్ని రూపొందించటానికి నిర్మాతలు ప్రేరణ అరోరా, శివివన్‌ నారంగ్‌, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ అహర్నిశలు కష్టపడుతున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నటించనుంది. అలాగే ప్రతినాయకి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ నటించనుంది. ఆ వివరాలను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్‌ ఇండియా ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందని సెకండ్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 2025లో విడుదలకు సిద్ధమవుతున్న జటాధర సినిమాతో ఓ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండండి. హరోంహరతో సూపర్‌ హిట్‌ కొట్టిన సుధీర్‌ బాబు అక్టోబర్‌ 11న మా నాన్న సూపర్‌ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.