English | Telugu

సుబ్రమణ్యం..అదిరిందయ్యా నీ టైమింగ్..!!

మంచి సినిమా తీయ‌డం ఎంత కీల‌క‌మో, స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేసుకోవ‌డం కూడా అంతే కీలకమని సుబ్బ‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ మరోసారి నిరూపించింది. ఓవ‌రాల్‌గా ఇది ఓకే ఒకే సినిమా. చూసి తీరాల్సిందే అనేంత గొప్ప సినిమా కాద‌ని క్రిటిక్స్ తేల్చేసిన ...ఈ సినిమా వ‌సూళ్లు మాత్రం భారీగానే ద‌క్కుతున్నాయి. దీనికి కారణం ఈ సినిమా స‌రైన స‌మ‌యంలో రిలీజ్ కావడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

తొలి రెండు రోజుల్లో దాదాపుగా రూ.8 కోట్లు వ‌సూలు చేసిందీ చిత్రం. శ‌ని, ఆదివారాలు క‌లిపితే.. క‌నీసం రూ.15 కోట్లు వ‌చ్చేస్తాయి. అంటే… పెట్టుబ‌డి మొత్తం తొలివారమే తిరిగొచ్చేస్తుంద‌న్న‌మాట‌. శాటిలైట్ రూపంలో నిర్మాత‌కు మంచి లాభ‌మే వ‌చ్చింది. శుక్ర‌వారం బ‌క్రీద్ సెల‌వు దొర‌క‌డం చిత్రానికి బాగా క‌లిసొచ్చింది. అలాగే ఈ సినిమాకి పెద్దగా పోటీ లేకపోవడం కూడా బాగా కలిసివచ్చింది. మొత్తానికి సుబ్రమణ్యం టైమింగ్ అదిరిందని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.