English | Telugu

పోగొట్టుకున్నదాన్ని రాబట్టుకున్న హరీష్!!

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బ్లాస్టర్ తరువాత హరీష్ శంకర్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ ల లీగ్ లోకి వచ్చేశాడు. ఆ టైమ్ లో చాలా మంది టాలీవుడ్ టాప్ హీరోలు అతనితో పనిచేయడానికి రెడీ అయ్యారు కూడా. అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ చాన్స్ ఇవ్వడంతో రామయ్యా వస్తావయ్య సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు హరీష్.

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఓకే అయినట్టు, అడ్వాన్స్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయి, సినిమా డమాల్ అవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కూడా మా డబ్బు మాకు వెనక్కి ఇచ్చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో స్టార్ హీరోల దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఒప్పించే అవకాశం కూడా ఆయనకి లేకపోయింది.

లేటెస్ట్ గా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవడంతో అల్లు అర్జున్ తో సినిమాకి కూడా లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా చూసిన అల్లు అర్జున్ హరీష్ ని తన కోసం ఓ స్టొరీ సిద్దం చేయమన్నాడట. ఆల్రెడీ బన్నీ కోసం లైన్ రెడీ చేసిన హరీష్, పూర్తిస్థాయి స్క్రిప్టుని సిద్ధం చేసే పనిలో బిజీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీగా వున్న అల్లు అర్జున్..ఈ సినిమా తరువాత హరీష్ సినిమా చేసే అవకాశాలు ఎక్కువన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎక్కడి పోగొట్టుకున్న దానిని అక్కడే రాబట్టుకోవలన్న సూత్రాన్ని హరీష్ బాగానే ఫాలో అవుతున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.