English | Telugu
సమాజం కోసం బన్నీ ఏం చేయబోతున్నాడు?
Updated : Apr 23, 2016
సినిమా యాక్టర్లంటే కేవలం షూటింగ్‌లు, సెట్‌లు, గ్లామర్‌కే పరిమితమవుతారని. ఇంకేం పట్టించుకోరని, బయటి ప్రపంచంతో అంతగా సంబంధాలుండవని అనుకుంటారు జనంలో చాలామందికి ఈ అభిప్రాయం ఉంది. అయితే తమను అభిమానించి, ఆదరించి ప్రేమించే ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి ఏదైనా చేయ్యాలని తపన పడే నటులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందువరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తదితర స్వచ్చంధ సంస్థలను స్థాపించే ఆపదల్లో ఉన్నవారికి తమ చేతనైన సాయం చేశారు. ఆయన అడుగుజాడల్లోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ నడిచారు. విపత్తులు, విలయాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినప్పుడు పవన్ అందరికంటే ముందు స్పందించేవారు. హుదుద్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలవడంతో పాటు 50 లక్షల విరాళాన్నిఅందించారు. ఖమ్మంలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీజను పరామర్శించడానికి వచ్చి వైద్య ఖర్చుల కోసం 2 లక్షల సాయాన్ని ఇచ్చారు.
ఇప్పుడు తన మావయ్యల స్పూర్తితో ప్రజాసేవ చేయాలని, జనానికి గుర్తిండిపోయేలా ఏదైనా చేయాలని ఉందని చెప్పాడు. ఇంతకు ముందు బన్నీ తన సోషల్ రెస్పాన్స్‌బులిటీని చూపించారు. హుదుద్ తుఫాను తనకిష్టమైన విశాఖ నగరాన్ని ధ్వంసం చేసినప్పుడు బన్నీ కలత చెందాడు. వెంటనే సీఎం చంద్రబాబును కలిసి 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న మస్తాన్‌బీ అనే 65 ఏళ్ల అభిమాని బన్నీని చూడాలనివుందని చెప్పగానే విజయవాడకు తరలివెళ్లాడు. ఆమె కోరిక తీర్చి ఆనందం నింపాడు. ఎన్నోసార్లు రక్తదానాన్ని ఇవ్వడమే గాకుండా నలుగురి చేతా ఇప్పించిన ఒక అభిమాని ఇంటికి అనుకోని అతిథిగా వెళ్లి ఆ కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇలా తనకు చేతనైనంత సాయం చేస్తున్న బన్నీ మావయ్యలను మరిపించేలా మంచిపని చేయాలనుకుంటున్నాడు. ఆ పని ఏవిధంగా ఉండాలో ఇంకా స్పష్టంగా చెప్పకపోయినప్పటికి ఏదో చేయాలనే తపన మాత్రం ఉంది.