English | Telugu

విమర్శలపై రాజమౌళి రెస్పాన్స్‌.. కథ చెప్పడం మానేయాలా?

నిజాం పాలకులకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్‌ను ముస్లింగా చూపించడమేమిటని 'ఆర్ఆర్ఆర్' సినిమా నుండి ఎన్టీఆర్ టీజర్ విడుదలైన తరవాత విమర్శలు వచ్చాయి. వీటిని రాజమౌళి ముందుగానే ఊహించాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరోవైపు యూట్యూబ్ లో కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి ప్రెస్ మీట్ సందర్భంగా రాజమౌళి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

క్రిస్టియన్లు అయిన బ్రిటీషర్ల పాలనలో అల్లూరి సీతారామరాజు ఉన్నారు. పోరాటం చేశారు. నైజాంలోని ముస్లిం పాలనలో కొమరం భీమ్ ఉన్నారు. పోరాటం చేశారు. బ్రిటీషర్లు, నిజాం రాజులు బయట నుండి వచ్చినవాళ్లు. అల్లూరి, కొమరం హిందువులు. మీరు కథ అనుకున్నప్పుడు అటువంటిది ఉండకపోవచ్చు కానీ విడుదల సమయానికి మతపరమైన వివాదాలు వస్తే పరిస్థితి ఏమిటి? అని రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది.

"ఎక్కడి నుండి ఎక్కడికైనా లింక్ వేయవచ్చు అన్నమాట. ఓకే... కొమరం భీమ్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం ఇస్లాంకి సంబంధించినవాళ్లు. బ్రిటీషర్లపై అల్లూరి పోరాటం చేశాడు. బ్రిటీషర్లు క్రిస్టియన్లు. అందుకని, కథ చెప్పడం మానేయాలా? ఇటువంటి విమర్శలు వస్తాయి. ఊహించని విధంగా ఏదో ఒకటి వస్తుంది. దాని గురించి నేను ఆలోచించను. మనం సిన్సియర్ గా కథ చెబుతున్నామా? లేదా? అనేది ఒక్కటే పాయింట్" అని రాజమౌళి గతంలో చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివాదాలు రావడం సహజమైనదని ఆయన అన్నారు. కృష్ణగారు 'అల్లూరి', రాఘవేంద్రరావుగారు 'అన్నమయ్య' తీసినప్పుడు వివాదాలు వచ్చాయని, వివాదాల కోసం సినిమాలు తీయడం మానకూడదని ఆయన అన్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.