English | Telugu
తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమైన శ్రుతి!
Updated : Sep 24, 2023
నటనలోనూ, నాట్యంలోనూ ఆరితేరిన కళాకారుడు కమల్‌హాసన్. ఆయన వారసురాలిగా వచ్చిన శ్రుతిహాసన్‌కు నటనతోపాటు మ్యూజిక్‌లోనూ ప్రవేశం ఉంది. ఇంతకుముందు ఆమె రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇప్పుడు మూడో ఆల్బమ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఆల్బమ్ కమల్‌హాసన్‌తో కలిసి చేస్తోంది శ్రుతి. దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో కమల్‌హాసన్ ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఈ ఆల్బమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని శ్రుతి అంటోంది.
ప్రస్తుతం కమల్‌హాసన్ తన 233వ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం రెడీ అవుతున్నాడు. ఇక శ్రుతిహాసన్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో ప్రభాస్‌తో జతకడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, నాని హీరోగా ‘హాయ్ నాన్నా’ చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు, ‘ఎన్నై కేళుంగళ్’ అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.