English | Telugu

ఇది చాలు మహేష్ రెచ్చిపోవటానికి

తమిళ సినిమా సూపర్ స్టార్లు వేరే రాష్ట్రాల్లోనూ సత్తా చూపించి వారి మార్కెట్ ను పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. వారి చూసి మన టాలీవుడ్ సూపర్ స్టార్లు నేర్చుకోవాలని ఇది వరకే ఎంతో మంది సినీ విశ్లేషకులు చెప్పిన మనవారు అంతగా పట్టించుకోలేదు. లేటెస్ట్ బాహుబలి చూపించిన దెబ్బకు మనవారిలోనూ చైతన్యం మొదలైంది. ఇతర బాషల్లోను మార్కెట్లను కొల్లగొట్టాలని డిసైడ్ అయ్యారు.

తమిళ ఇండస్ట్రీ పై రీసెంట్ గా కన్నేసిన మహేష్ బాబు తమిళ ప్రముఖ దర్శకులతో కూడా పనిచేస్తానని ప్రకటించాడు. అలాగే తన శ్రీమంతుడు సినిమాని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి అక్కడ భారీగానే క్రేజ్ వచ్చిందట. శ్రీమంతుడిని 'సెల్వందన్’గా తమిళ వెర్షన్ ని 3కోట్లకు అమ్మారు. అసలకే సూపర్ స్టార్ మహేష్ అందరికి సుపరిచితమే..దాంతో అక్కడి బిజినెస్ జోరుగానే సాగిందట.

తమిళ వెర్షన్ ని కొనుకున్న నిర్మాత సినిమా రిలీజ్ కాకుండానే టేబుల్ ప్రాఫిట్ సంపాదించడట. సిరియస్ గా దృష్టి పెట్టిన మొదటిసారే మూడు కోట్లు సంపాదించాడు. ఇక సినిమా హిట్టయితే మనోడి మార్కెట్ పుంజుకోవడం ఖాయమని ఇండస్ట్రీ టాక్. ఇందంతా చూస్తుంటే టాలీవుడ్ సూపర్ స్టార్ త్వరలో కోలీవుడ్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయనిపిస్తోంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.