English | Telugu

శ్రీ‌నువైట్ల‌తో చ‌ర‌ణ్ సినిమా ఉంద‌ట‌


గోవిందుడు అంద‌రివాడేలే త‌ర‌వాత శ్రీ‌నువైట్ల తో సినిమా చేద్దామ‌నుకొన్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆగ‌డు సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని మార్చుకొన్నాడు. వైట్ల‌తో సినిమా ఉంది క‌దా అని మ‌రొక‌రికి క‌మిట్ కాలేదు. మ‌రో వైపు శ్రీ‌నువైట్ల కూడా ఖాళీ అయిపోయాడు. దాంతో రామ్ చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా ఏమిటి? ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తాడు?? అనే విష‌యాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ లేదు. చ‌ర‌ణ్ దాదాపుగా ఖాళీ అని ఫిల్మ్‌న‌గర్ వ‌ర్గాలు కూడా చెప్పుకొచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఆగిపోయింద‌నుకొన్న శ్రీ‌నువైట్ల సినిమా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించ‌డానికి చ‌ర‌ణ్ సై అన్నాడు. దాంతో శ్రీనువైట్ల - చర‌ణ్ సినిమా ఎట్టకేల‌కు ఓకే అయ్యింద‌ని టాలీవుడ్ టాక్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక స‌మాచారం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.