English | Telugu

ఇన్‌స్టాలో భ‌ర్త‌ను అన్‌ఫాలో అయిన శ్రీ‌జ‌.. ఆ ఇద్ద‌రూ విడిపోతున్న‌ట్లే!

చిరంజీవి చిన్న‌కుమార్తె శ్రీ‌జ త‌న పేరు చివ‌ర ఉన్న భ‌ర్త పేరును ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి తొల‌గించింది. దీంతో భ‌ర్త క‌ల్యాణ్‌దేవ్‌ నుంచి ఆమె విడిపోయిందంటూ రూమ‌ర్స్ గుప్పుమంటున్నాయి. ఆ ఇద్ద‌రికీ 2016 మార్చిలో వివాహం జ‌రిగింది. ఇద్ద‌రికీ ఒక పాప కూడా ఉంది. కొంత కాలంగా శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారంటూ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది కానీ ఇద్ద‌రిలో ఎవ‌రూ తాము విడిపోతున్నామ‌నే విష‌యాన్ని ధ్రువీక‌రించ‌లేదు.

Also read:ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ను క‌లిపేందుకు ర‌జ‌నీ విఫ‌ల‌య‌త్నం!

అయితే ఇప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ పేరును శ్రీ‌జ మార్చ‌డంతో అంద‌రి దృష్టీ దానిపై మ‌ళ్లింది. ఇదివ‌ర‌కు ఆమె "Sreeja Kalyan" అనే పేరును ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కోసం వాడేది. సోమ‌వారం ఆమె త‌న పేరును 'sreeja konidela' గా మార్చేసుకుంది. అంతేకాదు, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో క‌ల్యాణ్‌దేవ్‌ను అన్‌ఫాలో అవ‌డం గ‌మ‌నార్హం.

Also read:ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ఎందుకు విడిపోయారు?

2016 మార్చిలో బెంగ‌ళూరులోని దేవ‌న‌హ‌ళ్లి ద‌గ్గ‌రున్న ఒక ఫామ్‌హౌస్‌లో శ్రీ‌జ‌, క‌ల్యాణ్ వివాహం జ‌రిగింది. వారికి న‌విష్క అనే కూతురు పుట్టింది. శ్రీ‌జ‌కు ఇది రెండో పెళ్లి. అంత‌కు ముందు ఆమె శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ను వివాహ‌మాడింది. వారు 2011లో విడిపోయారు. వారికి నివృతి అనే కుమార్తె ఉంది. ఆ కుమార్తెను త‌నే పెంచుకుంటూ వ‌స్తోంది శ్రీ‌జ‌.

ఇప్పుడు వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా సెల‌బ్రిటీ జంట‌లు విడిపోతున్న వార్త‌లు మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌-స‌మంత విడిపోగా, లేటెస్ట్‌గా ఐశ్వ‌ర్య నుంచి తాను విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చాడు ధ‌నుష్‌. అదే బాట‌లో శ్రీ‌జ‌, క‌ల్యాణ్‌దేవ్ కూడా న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌ల్యాణ్‌దేవ్ హీరోగా న‌టించిన సూప‌ర్ మ‌చ్చి సినిమా సంక్రాంతికి విడుద‌లై డిజాస్ట‌ర్ అయ్యింది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.