English | Telugu

ప్రమాదకరమైన కొరియన్ వెబ్ సిరీస్ మళ్ళీ వస్తుంది

మూడేళ్ళ క్రితం విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(squid game)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రపంచ సినీ ప్రేమికులకి తెలిసిన విషయమే.ఇప్పుడు ఆ సిరీస్ కి కొనసాగింపుగా స్క్విడ్ గేమ్ పార్ట్ 2(squid game 2) ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వగా సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుపోతుంది.

ఫస్ట్ సీజన్ మాదిరిగానే సెకండ్ సీజన్ లో కూడా కొంత మంది వ్యక్తులు డబ్బు సంపాదించడం కోసం స్క్విడ్ గేమ్ లో భాగం కానున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.గత సీజన్ లో ఈ గేమ్ లో నాలుగువందల యాభై ఆరవ పోటీదారుడు సియాంగ్ గి హున్ ఆ ఆటలో మళ్ళీ పాల్గొని ఇది ప్రమాదకరమని తోటి సభ్యులని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథ

జీవితంలో సర్వస్వం కోల్పోయిన వాళ్లలో 456 మందిని సెలక్ట్ చేసి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఒక దీవిలో ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య కొన్ని రకాల గేమ్స్ ని ఆడించి ఓడిపోయిన వాళ్ళని చంపేస్తుంటారు.ఈ కథకి ప్రాణం పోసి ఒక కథగా తీసుకురావడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది.లీ జంగ్ జె, వి హా జూన్, లీ బయింగ్ హాన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.డిసెంబర్ 26 న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుండగా తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.