English | Telugu

ప్రముఖ నటుడు సుబ్బరాజు పెళ్లి..వధువు ఎవరు 

2002 లో రవితేజ(ravi teja)హీరోగా కృష్ణ వంశీ(krishna vamsi)దర్సకత్వంలో వచ్చిన 'ఖడ్గం' మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటుడు సుబ్బరాజు.ఆతర్వాత ఎన్నో చిత్రాల్లో విలన్ గా,ఫ్రెండ్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అశేష ప్రేక్షాభిమానుల అభిమానాన్ని పొందాడు.

రీసెంట్ గా సుబ్బరాజు(subbaraju)తన ఇనిస్టా అకౌంట్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తన శ్రీమతితో కలిసి ఒక బీచ్ లో దిగిన ఫోటోని షేర్ చేసాడు, అందులో ఇద్దరు పెళ్లి బట్టలతో ఉండటంతో సోషల్ మీడియా వేదికగా సుబ్బరాజుకి అభినందనలు తెలుపుతున్నారు.అయితే ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది, వధువు ఎవరనే విషయాలు మాత్రం సుబ్బరాజు వెల్లడి చెయ్యలేదు.కొన్ని రోజుల క్రితం సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో అనే విషయాన్నీ చెప్పిన సుబ్బరాజు ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి ఫొటోలతో కనపడటం టాక్ అఫ్ ది డే గా మారింది

పలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించిన సుబ్బరాజు 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఆర్య, సాంబ, భద్ర, నేనున్నాను,పోకిరి, దేశముదురు, పౌర్ణమి, యోగి,అతిధి,పరుగు, బుజ్జిగాడు, నేనింతే, దూకుడు, బుజ్జిగాడు,పవర్, శ్రీమంతుడు,అఖండ,మిర్చి,గద్దల కొండ గణేష్, బాహుబలి పార్ట్ 2 ,వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు సుబ్బరాజు కి మంచి గుర్తింపుని తెచ్చాయి.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.