English | Telugu

'పుష్ప‌'కు సౌండ్ ప్రాబ్లెమ్‌!

ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూసిన 'పుష్ప' మూవీ శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 17) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేయ‌గా, సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై వెల్లువెత్తిన ఎక్స్‌పెక్టేష‌న్స్ అనూహ్యం. మొద‌టిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల‌న్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ అయిపోయాయి. సుకుమార్ స్టోరీ టెల్లింగ్ ఆశించిన రీతిలో లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న 'పుష్ప‌'ను బ‌న్నీ ఫ్యాన్స్ మాత్రం ఆకాశానికెత్తుతున్నారు.

Also read:మార్నింగ్ షోస్‌కు 'పుష్ప‌' ఆక్యుపెన్సీ ఇదే!

అయితే ప‌లు చోట్ల ఈ సినిమాలో సౌండ్ మిక్సింగ్ స‌రిగా లేద‌నీ, దాంతో చాలా సంద‌ర్భాల్లో ఆర్టిస్టుల డైలాగ్స్ స్ప‌ష్టంగా వినిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. షూటింగ్‌లో జాప్యం కార‌ణంగా, విడుద‌ల తేదీ డిసెంబ‌ర్ 17 అని అనౌన్స్ చేసినందువ‌ల్లా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ను చాలా ఫాస్ట్‌గా చేయాల్సి వ‌చ్చింది. నిజానికి విడుదల తేదీ ముందు రోజు దాకా డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమాలో క‌రెక్ష‌న్స్ చేస్తూనే ఉన్నాడ‌ని స్వ‌యంగా అల్లు అర్జున్ మీడియా ఇంట‌రాక్ష‌న్ సంద‌ర్భంగా చెప్పాడు.

Also read:'పుష్ప' మూవీ రివ్యూ

'పుష్ప‌'కు ఆస్కార్ అవార్డ్ గ్ర‌హీత ర‌సూల్ పోకుట్టి సౌండ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశాడు. అంత‌టి పేరున్న వ్య‌క్తి ప‌నిచేసినా, సౌండ్ మిక్సింగ్‌లో క్వాలిటీ క‌నిపించ‌క‌పోవ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. సౌండ్ మిక్సింగ్ స‌రిగా లేనందువ‌ల్లే దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఇచ్చిన బీజీయం కూడా చాలా చోట్ల ఇబ్బందిపెట్టిందంటూ సోష‌ల్ మీడియాలో ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు. సినిమాకి సౌండ్ ప్రాబ్ల‌మే పెద్ద మైన‌స్‌గా మారింద‌ని అభిప్రాయ‌ప‌డ్డ‌వాళ్లు చాలామందే ఉన్నారు.