English | Telugu

బ‌న్నీ - బోయ‌పాటి.. ఓ పిరియ‌డ్ డ్రామా!

``త‌గ్గేదే లే`` అంటూ తాజాగా `పుష్ప - ద రైజ్`తో ప‌ల‌క‌రించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మిశ్ర‌మ‌స్పంద‌న తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. తొలిరోజు బాక్సాఫీస్ ముంగిట రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టిందీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. కాగా, సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాలూకు సెకండ్ పార్ట్.. ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అన్నీ కుదిరితే వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో రెండో భాగం `పుష్ప - ద రూల్` థియేట‌ర్స్ లోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. `పుష్ప - ద రూల్` త‌రువాత మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు అల్లు అర్జున్. హోమ్ బేన‌ర్ గీతా ఆర్ట్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వ‌చ్చే సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. స్వాతంత్ర్యానికి ముందు నాటి క‌థాంశంతో పిరియ‌డ్ డ్రామాగా ఈ మూవీ రూపొంద‌నుంద‌ట‌. అలాగే, పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కానుంద‌ని టాక్. ప్ర‌స్తుతం బోయ‌పాటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నార‌ని.. వ‌చ్చే సంవ‌త్స‌రం ఆరంభంలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే బ‌న్నీ - బోయ‌పాటి సెకండ్ జాయింట్ వెంచ‌ర్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్లడి కానున్నాయి.

మ‌రి.. `స‌రైనోడు` వంటి సంచ‌ల‌న చిత్రం అనంత‌రం అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో రాబోతున్న ఈ సినిమా.. ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.