English | Telugu
ఖాళీగా ఉన్న సూపర్ హిట్ హీరోయిన్..!
Updated : May 11, 2016
హీరోయిన్ కు ఒక్క సూపర్ హిట్ వస్తే చాలు, అవకాశాలు లైన్ కట్టేస్తాయి. ఇదీ సాధారణంగా అందరూ అనుకునే మాట. కానీ ఇది సగం నిజం మాత్రమే. ఎంత సూపర్ హిట్ సినిమాలో నటించినా, కొంతమంది హీరోయిన్లకు ఎలాంటి అవకాశాలూ రావు. ఈ కేటగిరీలోకే వస్తుంది బాలీవుడ్ బ్యూట్ సోనమ్ కపూర్. అనిల్ కపూర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం క్రియేట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న సోనమ్ కు బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ గా మంచి పేరే ఉంది. సినిమాల విషయంలోకి వస్తే, మొన్నీమధ్యే రిలీజైన నీర్జా సినిమాతో నటిగా మంచి మార్కులు సాధించడమే కాక, భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. దీంతో ఇన్నాళ్లూ డల్ గా ఉన్న సోనమ్ కెరీర్ ఇకపై రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుందనుకున్నారు బాలీవుడ్ సినీ పండితులు. విచిత్రంగా, అలా జరగలేదు. గ్లామర్ కు అడ్డు చెప్పకపోయినా, అద్భుతంగా నటిస్తున్నా, అవకాశాలు మాత్రం ఈ భామకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యాషన్ ర్యాంప్ వాక్స్, మూవీ ఫెస్టివల్స్ కు అటెండ్ అవడం లాంటివి చేస్తూ టైం పాస్ చేస్తోంది. అసలు స్క్రిప్ట్స్ రాలేదా అంటే వచ్చాయి కానీ స్టోరీ నాకు నచ్చలేదు అని చెబుతోందీ బక్కపలచని భామ. బహుశా ఒకసారి లేడీ ఓరియెంటెడ్ చేస్తే, ప్రతీసారీ అలాంటివే కావాలనిపిస్తుంటుందేమో మరి..