English | Telugu
అబ్దుల్ కలాం బయోపిక్ లో మహేష్ విలన్..!
Updated : May 11, 2016
మహేష్ బాబు సైనికుడు సినిమాలో విలన్ పాత్ర వేసి, తెలుగోళ్లనందర్నీ మెప్పించాడు ఇర్ఫాన్ ఖాన్. ఛాలెంజింగ్ పాత్రల్ని చేయడంలో దిట్ట అని ఇర్ఫాన్ కు పేరు. తాజాగా అబ్దుల్ కలాం జీవితం పై బాలీవుడ్ లో తయారవుతున్న బయోపిక్ లో కలాం పాత్రను పోషించబోతున్నాడట. మిస్సైల్ మ్యాన్ గా పేరొందిన కలాం భారతదేశ రక్షణ వ్యవస్థను ఎలా బలపరిచారు, ఆయన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులెదుర్కొన్నారు లాంటి విషయాలన్నింటీనీ ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రమోత్ గోరె అనే మరాఠీ నిర్మాత ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడు. సినిమా కోసం ఇఫ్పటికే రీసెర్చ్ పూర్తి చేసిన ప్రమోత్, ఏపిజే అనే పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. వచ్చే ఏడాది జూలై సమయానికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది. కలాం పాత్రకు ఇర్ఫాన్ ను అనుకుంటున్నామని చెప్పిన నిర్మాత ప్రమోత్, దర్శకుడెవరన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. ఏదేమైనా, బాలీవుడ్ సినీజనాలు వరస బయోపిక్ లతో అదరగొట్టేస్తున్నారు. వచ్చిన ప్రతీ బయోపిక్ కాసులు కురిపిస్తుండటమే అందుక్కారణం.