English | Telugu

సోనాక్షితో పోటీకి తమన్న సిద్ధం


బాలీవుడ్ బాక్సాఫిసు దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పె పనిలో వున్న చిత్రాలు హాలీడే, హమ్ షకల్. ఇప్పటికే విడుదలైన 2 వారాలలో హాలిడే చిత్రం 97.08 కోట్ల కలెక్షన్ తెచ్చిపెట్టింది. అక్షయ్ కుమార్, సోనాక్షి హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు సంపాదిస్తోంది. అయితే శుక్రవారం విడుదలైన హమ్‌‌షకల్ చిత్రం హాలీడ్ కి పోటీనిచ్చే అవకాశాలున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. సైఫ్ అలీఖాన్, రితేష్, తమన్నా, బిపాషా, ఇషా ఇలా చాలా మంది తారాలు నటిస్తున్న ఈ కామెడీ చిత్రం హాలిడే చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపింటవచ్చని అనుకుంటున్నారు. అయితే మరో వైపు హమ్ షకల్ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గతంలో వచ్చిన గ్రేట్ మస్తీ చిత్రం తరహాలో ఈ సినిమా కూడా కొన్ని రోజుల్లో ఊపందుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు విమర్శకులు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.