English | Telugu

సత్యమూర్తికి ఇంకా ఐదు కోట్లు కావాలట!!

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికి రిలీజైన రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. కానీ సినిమాను కొన్న బయ్యర్లను మాత్రం నష్టాలను తెచ్చిపెట్టకుండా బయటపడేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలోకి వెళ్ళాలంటే ఇంకా ఐదు కోట్ల వరకు వసూళ్ళు రాబట్టాలట. 5వ వారంలోకి అడుగుపెట్టిన సన్ ఆఫ్ సత్యమూర్తి ప్రస్తుతం నిజాంలో 25 థియేటర్లు, ఉత్తరాంధ్రలో 30 థియేటర్లలో నడుస్తున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు రాబట్టిన వసూళ్ళు ఇలా వున్నాయి.

నైజాం రూ. 13.10 కోట్లు
సీడెడ్ రూ.6.11 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 3.93 కోట్లు
గుంటూరు రూ. 3.10 కోట్లు
కృష్ణ రూ. 2.45 కోట్లు
ఈస్ట్ గోదావరి రూ. 2.74 కోట్లు
వెస్ట్ గోదావరి రూ. 2.37 కోట్లు
నెల్లూరు రూ. 1.36 కోట్లు

తెలంగాణ + ఏపీ కలిపి రూ.35.16 కోట్లు

కర్ణాటక రూ. 5.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.30 కోట్లు
ఓవర్సీస్ రూ. 6.20 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్నీ కలిపి రూ. 48.06 కోట్లు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.