English | Telugu

నేను సింగల్...బ్రేకప్ ఒప్పుకున్న త్రిష

వ‌రుణ్‌ మనియన్ తో బ్రేకప్ జరిగిపోయిన విషయాన్ని త్రిష అఫీషియ‌ల్‌గా ప్రకటించింది. ''నా గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వందల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..వాటిని వదిలేయండి..నేను ఆనందంగా సింగల్ గా వున్నాను''అంటూ ట్విట్టర్ లో తెలియజేసింది త్రిష. వ‌రుణ్‌ మనియన్ తో నిశ్చితార్థo తరువాత జాయింటుగా నిర్వ‌హించిన పార్టీలో వచ్చిన గొడవ వీరి బ్రేక‌ప్‌కి దారి తీసింద‌ని తెలుస్తోంది. ఇన్నాళ్ళు దీనిపై త్రిష స్పందించకపోవడంతో అవన్ని రూమర్లేనని అందరూ అనుకున్నారు. కానీ త్రిష దీనిపై క్లారిటీ ఇవ్వడంతో నిజమని తేలిపోయింది. త్రిష త‌న మ‌న‌సు చెప్పిన‌ట్టు న‌డుచుకొంద‌ని, పెళ్ళి చేసుకొని విడిపోయే బదులు..ఇప్పుడే విడిపోతే మంచిదని భావించినట్టు సమాచారం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.