English | Telugu

పెళ్లి తర్వాత కొత్త చిత్రంలో శోభిత అక్కినేని! హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ప్రముఖ హీరోయిన్ 'శోభిత ధూళిపాళ్ల'(Sobhita Dhulipala)గత ఏడాది డిసెంబర్ లో 'నాగచైతన్య'(Naga Chaitanya)తో వివాహం చేసుకొని 'శోభిత అక్కినేని' గా మారిన విషయం తెలిసిందే. 2016 లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'రామన్ రాఘవ్ 2 .0 'తో సినీ రంగ ప్రవేశం చేసిన శోభిత అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. ఎలాంటి క్యారక్టర్ లో అయినా అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించగలదు. గూఢచారి, ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్, మేజర్, పొన్నియన్ సెల్వం పార్ట్ 1 , పార్ట్ 2 వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.

ఇక శోభిత నుంచి వచ్చిన చివరి మూవీ 'లవ్ సితార'. బాలీవుడ్ లో తెరకెక్కగా టైటిల్ రోల్ 'సితార' క్యారక్టర్ లో 'శోభితా'నే పోషించగా, గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తర్వాత శోభిత ఎలాంటి సినిమాఒప్పుకోకపోవడంతో సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనపడి సంవత్సరం అవుతుంది. శోభిత రీసెంట్ గా తమిళ దర్శకుడు 'పా రంజిత్'(Pa Ranjith)తెరకెక్కిస్తున్న 'వెట్టువమ్'(Vettuvam)లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. యాక్షన్ కోణంలో సాగే శక్తివంతమైన క్యారక్టర్ లో శోభిత కనిపించబోతుందనే న్యూస్ కూడా ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పా రంజిత్ చిత్రాలన్నీ దాదాపుగా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతాయి. దీంతో వెట్టువమ్ లో శోభిత చెయ్యడం ఖాయమైతే, ఆమె రీ ఎంట్రీ మరింత వేగంగా దూసుకుపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ఆర్య(Arya),విఆర్ దినేష్(Vr Dinesh)హీరోలుగా చేస్తుండగా, ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కథ, కథనాలపై ఆసక్తి నెలకొని ఉంది., తంగలాన్ వంటి భారీ హిట్ తర్వాత పారంజిత్ చేస్తున్న మూవీ కావడంతో సౌత్ సినీ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.



అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.