English | Telugu

బోయపాటి శ్రీను కొత్త రికార్డు.. ఒక్క నెలలోనే 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన ‘స్కంద’!

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో కథకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో, యాక్షన్‌ సీక్వెన్స్‌లకు, పవర్‌ ఫుల్‌ డైలాగులకు, హీరో ఎలివేషన్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఇస్తాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్‌గా తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు బోయపాటి. నటసింహ నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్‌, అఖండ వంటి బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించి ఇప్పుడు అఖండ2ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇదిలా ఉంటే.. గత ఏడాది రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘స్కంద’ చిత్రాన్ని కూడా తన గత చిత్రాల మాదిరిగానే హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో, పవర్‌ఫుల్‌ డైలాగులతో నింపేశాడు. 2023 సెప్టెంబర్‌ 28న తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన ‘స్కంద’ ఏవరేజ్‌ సినిమా అనే టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతనెలలో ఈ సినిమా హిందీ వెర్షన్‌ను యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. అనూహ్యంగా కేవలం ఒక్క నెలలోనే 100 మిలియన్‌ వ్యూస్‌తోపాటు, 1 మిలియన్‌ లైక్స్‌ సాధించి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇంత తక్కువ కాలంలో 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. అయితే 5 సంవత్సరాల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ ప్రీత్‌ జంటగా బోయపాటి శ్రీను రూపొందించిన ‘జయజానకి నాయక’ చిత్రాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేయగా ఇప్పటికి ఈ సినిమా 848 మిలియన్‌ వ్యూస్‌, 5 మిలియన్లకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఒక సినిమాకి ఇంత భారీగా వ్యూస్‌, లైక్స్‌ రావడం ప్రపంచ రికార్డనే చెప్పొచ్చు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.