English | Telugu

గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ కోసం లేఖ విడుదల చేసిన శిరీష్ రెడ్డి 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సుదీర్ఘ కాలం నుంచి చిత్రాలు నిర్మిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాతలు దిల్ రాజు(Dil Raju)శిరీష్ రెడ్డి(Sirish Reddy). రెండు రోజుల క్రితం రీసెంట్ గా శిరీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మా బ్యానర్ లో వచ్చిన 'గేమ్ చేంజర్'(Game Changer)ప్లాప్ తో చాలా నష్టపోయాం. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కనీసం రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)ఫోన్ చెయ్యలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మెగా అభిమానులు శిరీష్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ సారి రామ్ చరణ్ జోలికి వస్తే అంతు చూస్తామంటూ శిరీష్ రెడ్డి, దిల్ రాజు కి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది.

దీంతో శిరీష్ రెడ్డి స్పందిస్తు గేమ్ చేంజర్ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి సాన్నిహిత్య సంబంధం ఉంది.మేము చిరంజీవి గారి, రామ్ చరణ్ గారి, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడం. ఒక వేళ నా మాటలు ఎవరి మనోభావాల్ని అయినా ఇబ్బందికి గురి చేసి ఉంటే క్షమించండని ఒక లెటర్ విడుదల చేసాడు.

శిరీష్ చేసిన వ్యాఖ్యల పట్ల దిల్ రాజు కూడా మాట్లాడుతూ శిరీష్ తన ఇంటర్వ్యూలో భాగంగా పొరపాటున ఆ విధంగా మాట్లాడాడు. శిరీష్ కి నాకు చరణ్ పట్ల ఎంతో అభిమానం ఉంది. గేమ్ చేంజర్ కి సంబంధించి షూటింగ్ లేట్ అవుతున్నా కూడా చరణ్ మా కోసం వేరే సినిమాకి కమిట్ కాలేదని చెప్పాడు. దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మించిన 'తమ్ముడు'(Thammudu)మూవీ ఈ నెల 4 న విడుదల కానుంది. నితిన్(Nithiin)హీరోగా చేస్తుండగా వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్(venu Sriram)దర్శకత్వం వహించాడు.సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ, సౌరభ్ సచ్ దేవా కీలక పాత్రలు పోషించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.