English | Telugu

రాహుల్‌కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

ఇటీవలి కాలంలో ఎన్నో సూపర్‌హిట్‌ పాటలతో అందర్నీ అలరిస్తూ ‘నాటు నాటు..’ పాటతో ఆస్కార్‌ వరకు వెళ్లిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న న్యూస్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆగస్ట్‌ 17న రాహుల్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన ప్రేయసి హర్షిణిరెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు రాహుల్‌.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రాహుల్‌కు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. అయితే ఎవరీ హర్షిణిరెడ్డి అని నెటిజన్లు సెర్చ్‌ చేయడం మొదలుపెట్టారు. చివరికి పూర్తి వివరాలు తెలిసాయి. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. నెల్లూరుకి చెందిన హర్షిణి... నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్న విజయ్‌కుమార్‌ కుమార్తె. 1985లో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు విజయ్‌కుమార్‌. రాహుల్‌ వివాహం చేసుకోబోయే హర్షిణిరెడ్డి గురించి తెలుసుకొని ఆమెకు ఇంత బ్యాక్‌గ్రౌండ్‌ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆస్కార్‌ అవార్డు అందుకున్న పాటను అద్భుతంగా ఆలపించిన రాహుల్‌ ప్రస్తుతం సినిమా పాటలతో, మ్యూజిక్‌ వీడియోలతో బిజీగా ఉంటున్నాడు. త్వరలోనే వైవాహిక జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అఫీషియల్‌గా రిలీజ్‌ చెయ్యలేదు. కానీ, సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు బాగా సర్క్యులేట్‌ అవుతున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.