English | Telugu

సిద్ధార్థ "లవ్ ఫెయిల్యూర్"

సిద్ధార్థ "లవ్ ఫెయిల్యూర్" అంటే మనోడు ఎవరినో ప్రేమించి భంగపడి భగ్న ప్రేమికుడయ్యాడని కాదు. సిద్ధార్థ హీరోగా, అమలా పాల్ హీరోయిన్ గా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో, ఎటాకీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, వైనాట్ స్టుడియోస్ అధినేత యస్.శశికాంత్ నిర్మిస్తున్న చిత్రం" లవ్ ఫెయిల్యూర్".

ఈ చిత్రానికి హీరో సిద్ధార్థ, సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్న నీరవ్ షా సహ నిర్మాతలుగా వ్యవహరించటం విశేషం. థమన్ యస్.యస్. సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పేరు "లవ్ ఫెయిల్యూర్" అంటే ఈ సినిమా పేరు వింటేనే ఈ సినిమా కథేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ప్రేమ కథ కాబట్టి యూత్ ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా దీన్లో ఉంటాయని అనుకోవచ్చు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.