English | Telugu

సిద్ధార్థ రెండవ పెళ్ళి

పాతికేళ్ళ యువ నటుడిలా కనపడే సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, ఎట్టకేలకు హీరోగా స్థిరపడ్డాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తను నటిస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ 2003 లో తన స్నేహితురాలు మేగ్నాని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. వారి ప్రేమ మూడేళ్ళ ముచ్చటగా సాగి 2006 లో విడాకులకు దారి తీసింది. అప్పటి నుండీ సరైన జీవితభాగస్వామి కోసం సిద్ధార్థ చేయని ప్రయత్నం లేదు.

ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించాడు సిద్ధార్థ. కానీ ఆ ప్రేమ పెళ్ళి వరకూ వచ్చే సూచనలు కనపడలేదు. ఆ తర్వాత కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న పుకార్లు బలంగా వినిపించాయి. కానీ అది కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య ఒక నెల రోజుల్లో తన వివాహం గురించి మీడియాకు సిద్ధార్థ తెలియజేయనున్నాడని మరో మాట వినిపిస్తోంది...! ఒక నెల ఆగితే సిద్ధార్థ రెండవ పెళ్ళి గురించిన సమాచారమ తెలిసే అవకాశం ఉంది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.