English | Telugu

బాబోయ్‌ శంకర్‌ 'ఐ' మళ్ళీ వాయిదా

ఇండియన్ సినిమా ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. విక్రమ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘ఐ’ మరోసారి వాయిదా పడే అవకాశం వున్నట్లు సమాచారం. ఫైనాన్షియల్ ప్రాబ్లెంమ్స్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతకు, ఫైనాన్షియర్‌ మధ్య ఆర్ధిక లావాదేవిల్లో వివాదం రావడంతో, ఫైనాన్షియర్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి ‘ఐ’ సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా ఆదేశించారు. ఈనెల 30 తర్వాత విడుదల విషయాన్ని ఆలోచించాలని సూచించారు. దీంతో యూనిట్ సభ్యులు ప్రస్తుతం టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. మరోవైపు నిర్మాత, ఫైనాన్షియర్‌ మధ్య చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య అవగాహన కుదిరితే ఈ సినిమా యథావిధిగా జనవరి 14వ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం వుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.