English | Telugu

బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా 'శాకుంతలం'!

భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు రాబడతాయి. అయితే సమంత టైటిల్ రోల్ పోషించిన 'శాకుంతలం' మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కి ఈ స్థాయి బడ్జెట్ అనేది రిస్క్ తో కూడుకున్నదే. కానీ సబ్జెక్టు మీద నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే వారి నమ్మకం నిజం కాలేదు.

'శాకుంతలం' ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.20 కోట్లని అంచనా. కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా అందులో 20 శాతం కూడా రికవర్ చేయడం కష్టమే అనిపిస్తోంది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.2.24 కోట్ల షేర్ రాబట్టిందని అంచనా. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజుకే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. రెండో రోజు రూ.71 లక్షల షేర్ రాబట్టగా, మూడో రోజు రూ.65 లక్షల షేర్ రాబట్టింది. దీంతో మొదటి వీకెండ్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా రూ.3.60 కోట్ల కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కలెక్షన్స్ మరింతగా డ్రాప్ అవుతాయి. పైగా చాలా చోట్ల రెండు వారాల క్రితం విడుదలైన దసరా, అలాగే డబ్బింగ్ సినిమాలు రుద్రుడు, విడుదల కలెక్షన్స్ బెటర్ గా ఉన్నాయి. ఈ లెక్కన శాకుంతలం ఫుల్ రన్ లో రూ.5 కోట్ల షేర్ మార్క్ నైనా అందుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.