English | Telugu

ఎన్టీఆర్‌ శక్తి ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీర్‌ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా, వైయజంతి మూవీస్‌ బ్యానర్‌పై మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "శక్తి'. ఈ చిత్రం ఆడియో వేడుక నందమూరి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. "శక్తి' ఆడియో సీడీని యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఆవిష్కరించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మకి అందించారు. అనంతరం "శక్తి''లోని ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను జాకీ ష్రాఫ్ రిలీజ్‌ చేసారు. ఇక ఈ ఆడియో వేడుకలో ఇలియానా డ్యాన్స్‌ చేసి నందమూరి అభిమానులను మురిపించింది. అనంతరం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేయడంతో తన అభిమాన నటుడి డ్యాన్స్‌ను దగ్గరుండి చూసిన అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అశేష నందమూరి అభిమానులు పాల్గొన్న ఈ ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌, ఇలియానా, మెహర్‌ రమేష్‌, అశ్వనీదత్‌, జాకీ ష్రాఫ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇక ఆడియో రిలీజ్‌ మొదలుకొని ఎండింగ్‌ వరకూ సుమ యాంకరింగ్‌ చేశారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం