English | Telugu

షారుఖ్ వాళ్లకు అభిమాని అట..

ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో నేరుగా పంచుకుంటారు. అందుకే ఆయన ట్విట్టర్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాజాగా ఆ ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా షారుఖ్, అభిమానులపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. ఈ 18వేల మందికి నేను అభిమానిని అంటూ, తన ఫ్యాన్ పోస్టర్ ను పెట్టారు షారుఖ్. ప్రస్తుతం, షారుఖ్ ఫ్యాన్, రయీస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రయీస్ లో గ్యాంగ్ స్టర్ గా, ఫ్యాన్ లో ఒక హీరో వీరాభిమానిగా నటిస్తున్నారు. ఫ్యాన్ సినిమాలో షారుఖ్ తనకు తానే అభిమానిగా నటించడం విశేషం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.