English | Telugu
మహేష్ బాబు కూతురు కూడా నటిస్తోందా..?
Updated : Feb 24, 2016
శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న బ్రహ్మోత్సవంలో మహేష్ కూతురు సితారతో చిన్న పాత్ర వేయించాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ట్రై చేస్తున్నాడట. మహేష్ తో చర్చించినప్పటికీ, మహేష్ ఇంకా ఏ మాట చెప్పలేదని సమాచారం. మహేష్ ఒకే అంటే సితార కూడా సినీ బాలతారల లిస్ట్ లో చేరిపోనుంది. ఇప్పటికే నేనొక్కడినే లో మహేష్ తనయుడు గౌతమ్ ఒక పాత్ర చేసి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. మహేష్ కూడా బాలనటుడిగానే తెరపైకి వచ్చాడు. అందుకే సెంటిమెంట్ గా మహేష్ తన పిల్లల్ని కూడా తెరకెక్కిస్తున్నట్టున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న బ్రహ్మోత్సవం మే లో రిలీజ్ కు ముస్తాబవుతోంది.