English | Telugu

అట్లీ డైరెక్షన్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్!.. ఎవరు పాన్ ఇండియా హీరో 


-సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వరుణ్ తేజ్
-అట్లీ తో సినిమా ఉంటుందా
-అసలు సదరు వార్త నిజమేనా
-అల్లు అర్జున్ తో సినిమా ఎంత వరకు వచ్చింది

పర్ఫెక్ట్ హీరోకి కావలసిన కట్ అవుట్, ఫిజిక్, పెర్ ఫార్మెన్స్ ఉన్న వాళ్ళల్లో వరుణ్ తేజ్(Varun Tej)ఒకరు. అభిమానుల చేత మెగా ప్రిన్స్ అనిపించుకుంటున్న వరుణ్ తేజ్ కొంత కాలంగా వరుస ప్లాప్స్ ని చవి చూస్తున్నాడు. ఎంతలా అంటే 2019 లో సోలో హీరోగా వచ్చిన 'గద్దల కొండ గణే'ష్ తర్వాత నాలుగు సినిమాలు చేస్తే ఒక దాన్ని మించి ఒకటి అతి పెద్ద డిజాస్టర్స్. f 3 విజయం ఉన్నా విక్టరీ వెంకటేష్(Venkatesh)కూడా సదరు విజయానికి హక్కు దారుడుగా ఉండిపోయాడు. అన్ని రకాల జోనర్స్ లో చెయ్యాలనే తాపత్రయంలో సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోకపోవడమే వరుణ్ తేజ్ ప్లాప్స్ కి మెయిన్ రీజన్ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.

ప్రెజంట్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కొరియన్ కనకరాజు' చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే తన అప్ కమింగ్ మూవీ గురించి వస్తున్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సదరు వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని వింటే మీరు కూడా షాక్ అవ్వడం ఖాయం. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

అట్లీ.. (Atlee)అతి తక్కువ టైంలోనే ఇండియన్ క్రేజీ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తో భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇప్పటి వరకు తెరకెక్కని వినూత్నమైన సబ్జెట్స్ తో చేస్తన్నాడు. బడ్జెట్ పరంగా కూడా ఊహకి అందని విధంగా రూపొందుతుంది. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే వరుణ్ తో సినిమా చేస్తున్నాడనే టాక్ సౌత్ సినీ సర్కిల్స్ లో లేటెస్ట్ న్యూస్. వరుణ్ కోసం అట్లీ ఓ పవర్‌ ఫుల్ యాక్షన్ డ్రామాని సిద్ధం చేసినట్లు గా చెప్తున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లబోతుందని ఎవరికైనా తెలిసి స్ప్రెడ్ చేస్తున్నారా, లేక సరదాగా పుట్టిన రూమరా అనేది తెలియాలి. నెటిజెన్స్ మాత్రం సదరు న్యూస్ పై ఇదెక్కడి మాస్ కాంబోరా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

also read:జన నాయగన్ ఆగడంపై విజయ్ సంచలన స్పీచ్

అదే టైం లో సదరు న్యూస్ నిజం కాకపోవచ్చనే వాళ్ళు కూడా లేకపోలేదు.కాకపోతే ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఏమైనా జరగవచ్చు. గతంలో చాలా మందిబిగ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా హీరోలతో సినిమా చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ హీరోతో సినిమా చేసారు. ఏది ఏమైనా అట్లీ తో వరుణ్ సినిమా ఉంటే కనుక వరుణ్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడం ఖాయం. ఆ కెపాసిటీ వరుణ్ కట్ అవుట్ కి ఉంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం