English | Telugu
షారుక్ ఖాన్, దీపికా పదుకునే కి రాజస్థాన్ కోర్ట్ నుంచి తీపి కబురు
Updated : Sep 11, 2025
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shah Rukh Khan)అగ్ర హీరోయిన్ దీపికా పదుకునే(Deepika Padukone)లు దిగ్గజ కార్ల కంపెనీ 'హ్యుందాయ్'(Hyundai)కి ప్రమోటర్లుగా వ్యవహరిస్తు వస్తున్నారు. అందుకు సంబంధించిన యాడ్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటు ఉన్నాయి. సేల్స్ పరంగా కూడా సదరు కంపెనీ ముందుకు దూసుకెళ్తుంది. ఆగస్టు లో రాజస్థాన్ కి చెందిన 'కీర్తి సింగ్'(Kirthi singh)అనే వ్యక్తి హ్యుందాయ్ కి చెందిన 'అల్కాజర్' అనే మోడల్ కారుని కొనుగోలు చేసాడు.కొన్ని రోజులకి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కంపెనీని ఆశ్రయించాడు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో ప్రమోటర్లు గా ఉన్న దీపికా, షారుక్ లు కస్టమర్లని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, కంపెనీ తో పాటు ఆ ఇద్దరు కూడా బాధ్యులంటు అందరిపై పోలీస్ కేసు నమోదు చేయించాడు.
దీంతో షారుక్, దీపికా రాజస్థాన్ హైకోర్ట్(Rajasthan High Court)ని ఆశ్రయించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ని రద్దు చెయ్యాలని పిటిషన్ దాఖలు చెయ్యగా, తదుపరి విచారణ ని సెప్టెంబర్ 25 కి వాయిదా వేస్తు, ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రావడం షారుఖ్, దీపికా కి ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. షారుక్ ప్రస్తుతం తన వారసుడు 'ఆర్యన్ ఖాన్'(Aryan Khan)దర్శకత్వంలో తెరకెక్కిన 'బాడ్స్ ఆఫ్ బాలీవుడ్'(Bads Of Bollywood)చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 18 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. షారుఖ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంతో దీపికా బిజీగా ఉంది.