English | Telugu
ఆగస్ట్ 7న క్లాప్ కొట్టనున్న మహేష్
Updated : Aug 4, 2014
ఒకప్పటి హాస్య చిత్రాల కధానాయకుడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ ని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ నిదర్శకునిగా పరిచయం చేస్తూ చంటి అడ్డాల నిర్మిస్తున్న చిత్రం ఆగస్ట్ 7 ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ -విజయనిర్మల దంపతుల తో పాటు మహేష్ బాబుని కూడా ఆహ్వానించారు నరేష్. తొలి షాట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాప్ కొట్టనున్నారు. తొలి సన్నివేశానికి విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయనున్నారు.